Kesineni_Nani

విజయవాడ గ్రామీణ సాధికారత పథకం

Kesineni_Nani

గ్రామీణ సాధికారత పథకం

గణాంకణ మరియు ప్రణాళిక: కేశినేని నాని గారు ఒక దృఢసంకల్పంతో “టాటా ట్రస్ట్” ని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి తీసుకువచ్చి, సూక్ష్మస్థాయిలో అనే ప్రజాభివృద్ధికి సంబంధ పథకాలకు ప్రణాళికలను రూపకల్పన చేశారు. దీనివల్ల దాదాపు 265 గ్రామపంచాయితీల పరిధిలో అనేక ప్రజా సమస్యలను అర్ధం చేసుకునే అవకాశం లభించింది. “టాటా ట్రస్ట్” ద్వారా సూక్ష్మస్థాయి ప్రణాళికలను రూపొందించే క్రమంలో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. తద్వారా జిల్లాస్థాయిలోని వివిధ ప్రభుత్వ పరిపాలనా విభాగాలను మరియు శాఖలను సమన్వయపరుస్తూ విజయవంతంగా ఈ ప్రక్రియను పూర్తిచేసారు. ఈ బృహత్ కార్యక్రమం కేశినేని నాని గారి టీం యొక్క అకుంఠిత దీక్ష వల్లనే సాధ్యమయింది.

అమలు: గ్రామపంచాయితీలను స్మార్ట్ విలేజెస్ గా అభివృద్ధి చేసే క్రమంలో బహుళ నేపథ్యాలలో ప్రాజెక్టులను తయారుచేసి, “టాటా ట్రస్టు”వారు వాటిని సరైన విధంగా అమలు చేయడానికి “ప్రాజెక్టు పర్యవేక్షణ విభాగం” ఏర్పాటు చేశారు. టాటా ట్రస్ట్ సౌజన్యంతో ప్రతీ గ్రామపంచాయితీలో “గ్రామ స్థాయి క్రియాశీలక కమీటీ”లను ఏర్పాటు చేసి ప్రజల్లో సంఘటిత భావం మరియు జవాబుదారీతనం పెంపొందేలా చేయడం జరిగింది. అలాగే గ్రామస్థాయి క్రియాశీలక కమీటీలకు మరియు జిల్లా స్థాయి పరిపాలనా విభాగాలకు పరస్పర సహకారం, సమన్వయం మరియు సమాచారమార్పిడి జరిగేలా ప్రతి రెవెన్యూ మండలంలో ఒక “మండల సమన్వయకర్త”ను నియమించడం జరిగింది.

సంస్కరణ: గ్రామీణ అభివృద్ధి యోజన – విలేజ్ డెవలప్ మెంట్ ప్లాన్స్ (వీడీపీ) గ్రామీణ స్థాయిలో సమగ్ర అభివృద్ధిని సాధించే దిశలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో 2016లో “గ్రామీణ అభివృద్ధి యోజన – విలేజ్ డెవలప్ మెంట్ ప్లాన్స్ (వీడీపీ)” ప్రారంభించారు. అప్పటినుండి ఈ వీడీపీల ద్వారా ఎన్నో వినూత్నమైన అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రధానమైనవి “గ్రామీణ అభివృద్ధి కమీటీ”ల ఏర్పాటు, సాలిడ్ వేస్ట్ మానేజ్ మెంట్ (ఎస్.డబ్యు.ఎం) వారికి మూడుచక్రాల రిక్షాల పంపిణి, నియోజకవర్గం అంతటా మొక్కలు నాటే కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, వెర్మీ కంపోస్ట్ తయారీ చేసే కేంద్రాలు మరియు ఇతర ప్రజోపయోగ పథకాలు ప్రజల సహకారంతో అమలు చేశారు.

Kesineni_Nani